“ఆర్ఎక్స్100” సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించాడు దర్శకుడు అజయ్ భూపతి. హీరోయిన్‌ను నెగిటివ్ షేడ్‌లో చూపిస్తూ అత్యంత బోల్డ్‌గా తెరకెక్కిన ఆ సినిమా అనూహ్యంగా భారీ విజయాన్ని సాధించింది. అయితే అంతటి విజయవంతమైన సినిమాను రూపొందించినప్పటికీ అజయ్ భూపతి ఇప్పటివరకు తన రెండో సినిమాను పట్టాలెక్కించలేదు. అజయ్ భూపతి సినిమా ఈ హీరోతో అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతూనే వస్తున్నాయి. రీసెంట్‌గా ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ, సిద్ధార్థ్‌లతో ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారని, ఆ సినిమాకు “మహాసముద్రం” అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో ఏమో కానీ… ఈరోజు అజయ్ భూపతి “చీప్‌స్టార్” అంటూ ట్వీట్ చేశారు. రవితేజను దృష్టిలో పెట్టుకునే అజయ్ భూపతి అలాంటి మెసేజ్‌ను పోస్ట్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. మరి అజయ్ భూపతి నోరు విప్పితే కానీ ఆ చీప్ స్టార్ ఎవరన్నది, అసలు ఏమై ఉంటుందనేది తెలియదు.