telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

అమరావతి రైతుల పోరాటం ఒక చరిత్ర: చంద్రబాబు

chandrababu

అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభమై నేటికి 150 రోజులు అయింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ప్రకటనలో స్పందించారు. ‘కులముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు… ఇలా ప్రభుత్వం పెట్టిన అన్నిరకాల హింసలనూ తట్టుకుని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర’ అని ఆయన అన్నారు.ఈ ఉద్యమం స్ఫూర్తిదాయకమని, రైతులకు న్యాయం జరిగే వరకు అండగా తానుంటానని హామీ ఇచ్చారు.

తెలుగుదేశం ఉందని, అధైర్యపడొద్దని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. రాష్ట్రం కోసం 33వేల ఎకరాల భూములు త్యాగం చేసిన చరిత్ర ఇక్కడి ప్రజలదని, ప్రభుత్వానికే 5వేల ఎకరాల ఆస్తి కట్టబెట్టి ‘బిల్డ్ ఏపీ’ చేశారన్నారు. రాజధానిని తరలిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆవేదనతో 64 మంది రైతులు గుండెపోటుతో మరణించారని ఆయన చెప్పారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Related posts