మనం సాధారణంగా ఏదైన ప్రయాణానికి వెళితే.. కచ్చితంగా దాహం వేస్తుందని వాటర్ బాటిల్ ఇంట్లో నుంచే తీసుకుని పోతాం. పిల్లలు ఉన్న వారైతే… ఇంకా పక్కా ప్లానింగ్‌తో అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అలా ఏర్పాట్లు చేసుకుంటనే వాళ్లకు ప్రయాణం చేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు. అయితే… దాహాన్ని తీర్చుకోవడం కోసం మంచినీళ్లను బాటిల్స్‌లో స్టోర్ చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని నిల్వ ఉంచేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. ఇటీవల కాలంలో న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఇండియాతో పాటు అమెరికా, కెన్యా, బ్రెబిల్, ఇండోనేషియా, చైనా దేశాల్లో 11 బ్రాండ్లకు చెందిన 200కు పైగా ప్లాస్టిక్ బాటిల్స్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అందులో సగానికి సంగం బాటిల్స్‌లో మోతాదుకు మించి ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు తేల్చారు. గరిష్టంగా ఒక్కో బాటిల్‌లో 10000 ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే కుళాయి నీళ్లతో పోల్చుకుంటే… ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌లో నిల్వ ఉండే నీళ్ల వల్ల ముప్పు అధికమని తెలిపారు.