telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జేసీ కుటుంబానికి హైకోర్టు షాక్.. కొడుకు, కోడలికి నోటీసులు

jc-diwakar-reddy

టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి హైకోర్టు షాకిచ్చింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజు విషయంలో ఆయన కుమారుడు పవన్ రెడ్డి, కోడలు సంయుక్తారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు త్రిశూల్ సిమెంట్ సంస్థకు, బిజినెస్ పార్టనర్ వేణుగోపాల్ రెడ్డికి కూడా నోటీసులిచ్చింది. ఈ కేసును నిన్న విచారించిన హైకోర్టు… తదుపరి విచారణను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, లైమ్ స్టోన్ మైనింగ్ లీజు కోసం త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందంటూ తాడిపత్రికి చెందిన మురళీప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి 2011లో హైకోర్టులో పిల్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు గత నెలలో దివాకర్ రెడ్డితో సహా పలువురికి నోటీసులు జారీ చేసింది.

Related posts