కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నకిలీ దర్శన టిక్కెట్లు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.నకిలీ టికెట్టు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇందులో ప్రధాన నిందితుడు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు తయారు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇందులో అందరూ టీటీడీ ఉద్యోగులే ఉంటడం గమనార్హం.
స్కానింగ్ ఆపరేటర్ నరేంద్ర, లడ్డూ కౌంటర్ ఉద్యోగి అరుణ్ రాజు, ట్రావెల్ ఏజెంట్ బాలాజీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు మధ్యప్రదశ్‌కు చెందిన ముగ్గురు భక్తులకు నకిలీ దర్శన టిక్కెట్లు విక్రయించినట్లు ధర్యాప్తులో తేలింది. మూడు రూ.300 దర్శనం టిక్కెట్లను రూ.21వేలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
నకిలీ టిక్కెట్లతో శ్రీవారి దర్శనానికి వెళ్లిన ముగ్గురు భక్తులను విజిలెన్స్ అధికారులు విచారించగా ఈ వ్యవహారం బట్టబయలైంది. వీరిద్దరూ సహయంతో నకిలీ టిక్కెట్ల దండా జరిగిందనీ, వీరిద్దరూ నకిలీ టికెట్లను స్కానింగ్ చేయకుండానే భక్తులను దర్శనానికి అనుమతినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.
రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అమాయకులైన భక్తులను టార్గెట్ చేసుకుని నిందితులు దర్శనం టిక్కెట్ల పేరుతో ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని సమాచారం.
ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే టీడీపీ: విజయసాయిరెడ్డి