రేపు భాజపా ఆధ్వర్యంలో కరీంనగర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. ఈ చట్టంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా ర్యాలీ తలపెట్టామన్నారు. కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు జరగనున్న ఈ ర్యాలీలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు.
దేశ ఐక్యతను చాటేందుకు తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని సంజయ్ కోరారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్న నిధులతోనే అసోం వంటి రాష్ట్రాల్లో విపక్షాలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.