telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మందేసి చిందేస్తే.. జైలుకే…

no alcohol and no parties in goa beaches

పార్టీ అంటే గుర్తుకువచ్చే స్పాట్ గోవా. అలాంటిది అక్కడ పార్టీలు నిషేదించినట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇకనుండి బ్యాచ్‌లర్స్‌ ఆటలు సాగవు. ఇప్పుడు కలిసి కొంకణతీరంలో మందేసి చిందేయ్యాలంటే మాత్రం భారీగా మూల్యం చెల్లించక తప్పందంటున్నారు గోవా టూరిజం శాఖ. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తూ కనిపిస్తే రూ. 2000 జరిమానా తప్పదు. గత నెల 29 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.

నిబంధనలకు విరుద్ధంగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసినా, వంటలు వండినా జరిమానా విధించడంతో పాటు పరిస్థితిని బట్టి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే ప్రమాదం ఉంది. బృందంగా మందువినోదాల్లో తేలితే రూ.10,000 వరకు జరిమానా విధించాలని గోవా పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గోవా పర్యాటక చట్టంలో సవరణ కూడా చేసింది.

Related posts