ఫ్యామిలీ నుంచి “గౌరవం” చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అల్లు శిరీష్. ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసినా బ్లాక్ బస్టర్ హిట్ ను మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. చాలా గ్యాప్ తరువాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం “ఏబీసీడీ”. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా “ఎబిసిడి” అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలనటుడిగా సినిమాలు చేసిన మాస్టర్ భరత్ ఈ చిత్రంలో కీలకపాత్రలో కన్పించనున్నాడు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
Happy & proud to be featured on Provoke Lifestyle magazine. A fun & honest interview I did. Do read! #ProvokeLifestyle pic.twitter.com/ajikxIX5FB
— Allu Sirish (@AlluSirish) January 31, 2019
తాజాగా అల్లు శిరీష్ ప్రోవోక్ మ్యాగజైన్ కవర్ పై మెరిశాడు. తన ఇన్స్టాగ్రామ్ లో కవర్ ఫోటోను పోస్ట్ చేశాడు. “ప్రోవోక్ మ్యాగజైన్ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషంగానూ… గర్వంగానూ ఉంది. ఫోటో షూట్ & ఇంటర్వ్యూ ఫన్ గా ఉంది. ప్రోవోక్ కాపీస్ కొనుగోలు చేయండి!” అంటూ ట్వీట్ చేసాడు. ఈ ఫొటోలో పులి చారల లాంటి డిజైన్ ఉన్న హాఫ్ షర్ట్… ఎలిఫెంట్ బ్లాక్ కలర్ టోర్న్ జీన్స్… వైట్ కలర్ స్పోర్ట్ షూస్ వేసుకున్నాడు. ఈ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు అల్లు శిరీష్.
More pics from the Provoke Lifestyle magazine shoot. #ProvokeLifestyle pic.twitter.com/9urZocbsCN
— Allu Sirish (@AlluSirish) February 1, 2019