telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాలయ్య సినిమాలో హీరోయిన్ ఆమేనా..?

Shruthi

క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో పడింది చిత్రబృందం. త్రిష, శ్రుతిహాసన్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్రిష ఇదివరకే బాలకృష్ణతో కలిసి ‘లయన్’ సినిమాలో నటించింది. ఇక శ్రుతిహాసన్, గోపిచంద్ మలినేనికి లక్కీ హీరోయిన్‌గా మారింది. ఆమెతో చేసిన ‘బలుపు, క్రాక్’ రెండూ మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో గోపీచంద్ మరోసారి శృతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారట. మొదటినుంచి ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారనే ప్రచారం జరుగగా, ఫైనల్ గా శ్రుతిహాసన్‌ను ఖరారు చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. చూడాలి మరి హీరోయిన్ విషయంలో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది.

Related posts