telugu navyamedia
సినిమా వార్తలు

అర్థ పావు భాగ్యం ఔట్..

బిగ్ బాస్ హౌజ్ లో గత వారం రోజులుగా హౌజ్ మేట్స్ రచ్చ రసవత్తరంగా సాగుతోంది. అందరు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఎలిమినేషన్ ప్రక్రియకి సర్వం సిద్దమైపోయింది. ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్లు కాజల్‌, లోబో, ప్రియాంక సింగ్‌, ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, ప్రియ నామినేషన్‌లో ఉండగా లోబో, యానీ మాస్టర్‌, ప్రియాంక సింగ్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ శనివారం ఎపిసోడ్‌లో ప్రకటించాడు.

Appala Maria - Celebrity Style in Kalyana Vaibhogam Episode 982, 2021 from Episode 982. | Charmboard

దీంతో నటరాజ్‌ మాస్టర్‌, కాజల్‌, ఉమాదేవి, ప్రియ, కాజల్‌ డేంజర్‌ జోన్‌లో ఉండగా.. ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌ ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వారం ఉమాదేవినే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతుంద‌ని ఓ వార్త‌ సోషల్ మీడియాలో ఒక‌రి పేరు చ‌క్క‌ర్లు కొడుతుంది. ‘కార్తీకదీపం’ సీరియల్ లో అర్థ‌పావు భాగ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ దక్కించుకున్న ఉమాదేవి ఓటింగ్ శాతంలో వెనుకపడ్డట్టు వార్తలొస్తున్నాయి.

karthika deepam actor uma devi ,uma devi eliminated, uma devi eliminated from bigg boss telugu 5

కాగా.. శ‌నివారం జ‌రిగిన ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల్లో కొంతమంది అదుపు తప్పుతున్నారని.. కంట్రోల్ ఉండాలని హోస్ట్ నాగార్జున హెచ్చరించిన విష‌యం తెలిసిందే. మొదటి వారంలో కాస్త దురుసుగా ప్రవర్తించిన ఉమాదేవి సెకండ్ వీక్ లో మాత్రం పుంజుకుని మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఎలిమినేషన్ నుండి తప్పించుకోలేకపోయింది. అయితే ఈ రోజు జ‌రిగే ఎపిసోడ్ లో నాగార్జున‌ ఎవ‌రిని సెట్ చేస్తారో..ఎవ‌రిని ఫ‌ట్ చేస్తారో తెలియాల్సి ఉంది.

Related posts