telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

పవన్ చెప్పలేదు, అడగలేదు… మంత్రి పదవి ఇచ్చే పార్టీలోనే చేరతా… : అలీ

Ali comments Pawan Kalyan YCP

ప్రముఖ కమెడియన్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాలకు నెలవవుతూ ఉంటారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయనున్నారు. ఇటీవల ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను, వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కలిసి వరుసగా భేటీలు జరపడం సంచలంగా మారింది. తాజాగా ఈ విషయంపై స్పందించారు అలీ. ఓ పార్టీ తనకు మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీలో చేరతానని, తాను ప్రస్తుతం టీడీపీలో ఉన్నట్లు పవన్ కు తెలుసని, గతంలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నావా ? టికెట్ ఇస్తున్నారా ? అంటూ పవన్ తనను అడిగారని గుర్తు చేసుకున్నారు అలీ. జనసేనలోకి రమ్మని పవన్ తనను పిలవలేదని, అలాగే తాను కూడా వెళ్లలేదని, పవన్ పార్టీ పెట్టే విషయం తనకు ముందే తెలుసని, కానీ పవన్ ఈ విషయాన్నీ తనవద్ద నేరుగా ఎప్పుడూ ప్రస్తావించలేదని, పార్టీ పెట్టాక తాను కూడా పవన్ ను కలవలేదని, జనసేన పార్టీ తరపున పని చేయమని పవన్ ఎప్పుడూ తనను అడగలేదని స్పష్టం చేశారు. ఆయన వల్ల తనకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతోనే పవన్ తనను అడగకపోయి ఉండొచ్చని, సొంత మనుషులకు ఇబ్బంది పెట్టే పనులెప్పుడూ పవన్ చేయరని… అందుకే తాను కూడా వెళ్ళలేదని చెప్పుకొచ్చారు అలీ. 

Related posts