telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అనిల్-మహేష్ కాంబినేషన్ లో మరో సినిమా..?

గత సంక్రాంతికి మహేష్ బాబు-అనిల్ రావిపూడి కంబినేషన్ లో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ కా బాప్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత ప్రస్తుతం సూపర్ స్టార్  పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి తో ఓ సినిమా చేయనున్నాడు. అయితే రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ సినిమా ప్రారంభం చేయడానికి కనీసం ఆరు నెలలు సమయం పడుతుండటంతో మహేష్ ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. అయితే సరిలేరు నీకెవ్వరు హిట్ అయిన తర్వాత మళ్ళీ తమ కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుంది అన్ని ప్రకటించారు. కాబట్టి ఎఫ్ 3 పూర్తయిన తర్వాత అనిల్ మహేష్ సినిమా కథ పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసుకొని తర్వాత రాజమౌళితో సినిమా ప్రారంభించాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related posts