telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అనుమతి లేకుండా గైర్హాజరు.. చర్యలు తప్పవన్న క్రికెట్ అసోసియేషన్..

absent without permission is punishable

భారత ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శివందూబేలపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నెల 25న ప్రారంభమైన రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడాల్సి ఉండగా, అనుమతి లేకుండా విశ్రాంతి పేరిట మ్యాచ్‌కు డుమ్మా కొట్టారు. విండీస్‌తో వన్డే సిరీస్ ముగిసిన రెండు రోజుల్లోనే ఈ ఘటన జరిగింది. విండీస్‌తో సిరీస్‌లో వీరిద్దరితోపాటు శార్దూల్ ఠాకూర్ కూడా ఆడాడు. అయితే, రైల్వేస్‌తో మ్యాచ్‌కు శ్రేయాస్ అయ్యర్, శివందూబేలు డుమ్మా కొట్టగా, శార్దూల్ ఆడడం గమనార్హం. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవి చూసింది. దీంతో వారిద్దరూ ఎవరి సూచన మేరకు మ్యాచ్‌కు డుమ్మా కొట్టారన్న ప్రశ్న ఉదయించింది. ఇదే విషయమై వారిని ప్రశ్నించగా, సెలక్టర్లు చెప్పారని పేర్కొన్నారు.

తమకు బీసీసీఐ నుంచి కానీ, సెలక్టర్ల నుంచి కానీ విశ్రాంతి సమాచారం లేదని ఎంసీఏ అధికారులు పేర్కొన్నారు. సొంత నిర్ణయం తీసుకుని మ్యాచ్‌కు గైర్హాజరు కావడంపై ఎంసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రమూ సహించేది లేదని, త్వరలో జరిగే ఎంసీఏ బ్యారర్ల సమావేశంలో చర్చించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శార్దూల్ ఠాకూర్ సభ్యుడైనా రైల్వేస్ జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. దుబే మాత్రం చివరి రెండు మ్యాచుల్లో ఆడకపోయినా రైల్వేస్‌తో మ్యాచ్‌కు మాత్రం డుమ్మా కొట్టాడు. జాతీయ జట్టులో ఆడనప్పటికీ మ్యాచ్‌కు గైర్హాజరు కావడంపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

Related posts