telugu navyamedia
క్రీడలు వార్తలు

కెప్టెన్ గా ధోనిని దాటేసిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్..

ఫార్మాట్‌తో సంబంధం లేకుండా టీమిండియాను మాజీ కెప్టెన్ ధోనీ అగ్రస్థానంలో నిలిపాడు. మహీ సాధించిన కొన్ని ఘనతలు స్టార్ కెప్టెన్‌గా వెలుగిందిన వారికి కూడా సాధ్యం కాలేదు. అఫ్ఘనిస్తాన్‌ టీ20 కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ తాజాగా అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో అస్గర్ నాయకత్వంలో అఫ్ఘనిస్తాన్‌ జట్టు 41 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం ద్వారా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు అస్గర్ 51 మ్యాచ్‌ల్లో ఆప్ఘన్‌ జట్టుకు నాయకత్వం వహించగా.. ఇందులో 41 మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్నాడు. టీమిండియా తరపున ధోనీ తన కెరీర్‌లో 72 టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించగా.. ఇందులో 41 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. ఇక విజయాల శాతం పరంగా చూసుకుంటే.. ఎంఎస్ ధోనీ కన్నా అస్గర్ అఫ్గాన్ ముందున్నాడు. ధోనీ 59.28 శాతం విజయాల్ని సొంతం చేసుకోగా.. అస్గర్ ఏకంగా 81.37 శాతం విజయాల్ని నమోదు చేయడం గమనార్హం. మొత్తం 51 టీ20లకు నాయకత్వం వహించిన అస్గర్‌ కేవలం 10 మ్యాచ్‌ల్లోనే విఫలమయ్యాడు. దాంతో అతడి విజయ శాతం 81.37గా నమోదైంది. ఇది ధోనీ కన్నా గొప్ప రికార్డు. మహీ 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts