telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సూర్యకు కరోనా నెగెటివ్…

గత ఏడాది కాలంగా ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే మన దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణి చేస్తున్న కేసులు మాత్రం ఆగడం లేదు. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ నెల 8న తమిళ స్టార్ హీరో సూర్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సూర్యనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాను. మన జీవితం ఇంకా సాధారణ పరిస్థితికి రాలేదన్న విషయాన్ని మనందరం గ్రహించాలి. అలాగని భయంతో వణికిపోకూడదు. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నాకు వైద్యం అందిస్తోన్న వైద్యులకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ ద్వారా తెలిపాడు. ఇక తాజాగా సూర్య తమ్ముడు కార్తీ ట్విట్టర్ లో తన అన్న కరోనా నుండి కోలుకున్నట్లు తెలిపాడు. ”అన్న క్షేమంగా ఇంటికి వచ్చాడు. కానీ కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి ఉంది. మీరు చూపించిన ప్రేమకు అభిమానానికి ధన్యవాదాలు” అన్ని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇక కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సూర్యకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.ఇటీవల ఆయన నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు.  ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related posts