telugu navyamedia
సినిమా వార్తలు

“మహా” షూటింగ్ లో హన్సికకు గాయం

Hanshika Movie Maha First Look

ఒకప్పుడు జూనియర్ ఖుష్బూగా ప్రశంసలు అందుకున్న హీరోయిన్ హాన్సిక. ప్రస్తుతం అవకాశాలు లేక టాలీవుడ్ వెండితెరకు దూరమైంది. కానీ, కోలీవుడ్‌లో స్థిరపడిపోయింది. ఈమె ప్రస్తుతం నటిస్తున్న 50వ చిత్రం పేరు “మ‌హా”. యూఆర్ జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. హీరోయిన్ సెంట్రిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో గ‌తంలో ఎప్పుడూ చేయ‌ని పాత్ర‌ని హ‌న్సిక ఈ చిత్రంలో చేస్తుంద‌ని అంటున్నారు. ఇందులో విల‌క్ష‌ణ పాత్ర చేస్తున్న హ‌న్సిక ఎమోష‌న్స్‌ని అద్భుతంగా పండించ‌నుంద‌ట‌. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైంది ఫస్ట్ లుక్ ఇప్పటికే వివాదాస్పదమైంది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను ఇటీవల చిత్రీకరిస్తుండగా… హన్సిక జారి పడిపోయిందట. దీంతో ఆమె చేతికి గాయమైందట. అయినా హన్సిక ఆ గాయాన్ని లెక్క చేయకుండా షూటింగులో పాల్గొందని చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related posts