telugu navyamedia
సినిమా వార్తలు

మగాళ్లను ద్వేషించే జాబితాలో లేను : శృతి హాసన్

Shruthi-Hassan

హీరోయిన్ గా, సింగర్ గా, బెస్ట్ డ్యాన్సర్ గా మల్టిపుల్ టాలెంట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శృతి హాసన్. ఈ అమ్మడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మగాళ్లపై ద్వేషం, ఆడవాళ్ల సమస్యల గురించి ఒక్క మాటలో ఆన్సర్ ఇచ్చేసింది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఎదురయ్యే సమస్యలకు ప్రధానం కారణం వారిలో ఐక్యమత్యం లేకపోవడమే కారణమని, అందుకే తన టీమ్ లో ఎక్కువగా ఐక్యతతో ఉండేలా ప్లాన్ చేసుకుంటామని చెప్పుకొచ్చారు. అంతేకాదు “మగాళ్ళను ద్వేషించే క్యాటగిరిలో నేను లేను. ఎందుకంటే నా తండ్రి ఎంతో ప్రేమతో దైర్యంగా పెంచాడు ఆయన స్ట్రాంగ్ మ్యాన్.. అందుకే నేను స్ట్రాంగ్ వుమెన్ అయ్యాను” అని పేర్కొంది శృతి. ఇక లండన్ లో ఉన్న తన మ్యూజిక్ బ్యాండ్ లో అందరూ ఆడవాళ్లేనని, వారి టాలెంట్ ను గుర్తించి వారికి జాబ్ ఇచ్చానని అన్నారు. ప్రస్తుతం శృతి హాసన్ ఒక హిందీ సినిమాతో అలాగే మరో తమిళ్ సినిమాతో బిజీగా ఉంది. శృతి తెలుగు సినిమాలలో కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Related posts