telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెడీ కాండబ్బా… AA 20 అప్‌డేట్‌ వస్తాండాది…!

allu arjun in mass cast again with sukumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” భారీ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ చేయనున్నాడు. బన్నీ నటిస్తున్న 20వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. బన్నీ ఈ సినిమాలో లారీ డ్రైవర్, స్టైలిష్ బిజినెస్‌మెన్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. బన్నీకి జంటగా రష్మికా మందన్నా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. గతకొద్ది రోజులుగా ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు బన్నీ. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ అనౌన్స్ చేశారు. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌‌డే సందర్భంగా ఉదయం 9 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను రివీల్‌ను చేయనున్నట్టు తెలిపారు. ‘ఏమబ్బా, అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే.. AA 20 అప్‌డేట్‌ ఏప్రిల్‌ 8న, తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేసింది. ఆ రోజున మూవీ టైటిల్‌ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts