telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాస్టర్ మూవీ టీజర్ ఖాతాలో అరుదైన రికార్డు

vijay master movie releasing date

తమిళ సూపర్ స్టార్ విజయ్ తమిళ్‌లో ఎంత పెద్ద హీరో అయినప్పటికీ తెలుగులో మాత్రం అనుకున్నంత మార్కెట్ సాధించలేక పోయాడు. విజయ్‌కు తెలుగులో కనీసం సూర్య తమ్ముడు కార్తీ రేంజ్ కూడా లేకపోవడం గమనార్హం. అయితే కార్తీకి ఉన్నంత మార్కెట్ ఉన్నా దక్షిణ భారత్‌తో విజయ్‌ను కొట్టే హీరో లేదని చెప్పుకోవచ్చు. టాలీవుడ్‌లో విజయ్ విడుదల చేసిన ప్రతి సినిమా నిరాశకు గురిచేశాయి. అయితే విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఒక్క సారి థియేటర్లు తెరుచుకుంటే సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమా టీజర్ అనేక రికార్డులను తన పేరిట చేసుకున్న సంగతి తెలిసిందే. అయిత ఆ రికార్డులన్నీ కూడా కేవలం తమిళ భాషలోని టీజర్‌వే. ఇటీవల మాస్టర్ టీజర్‌ను తెలుగులో విడుదల చేశారు. ఈ టీజర్ తెలుగులోనూ మంచి ఆదరణ పోందింది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ తెలుగులో మంచి మార్కెట్ సంపాదిస్తాడేమో చూడాలి. ఒకవేల ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అయితే విజయ్‌కు తెలుగులో మొట్టమొదటి హిట్ సినిమాగా మాస్టర్ నిలుస్తుంది. మరి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో వేచి చూడాలి.

Related posts