telugu navyamedia
సినిమా వార్తలు

మీరు ప్రపంచానికి ప్రశ్న ఏమో నాకు మాత్రం సమాధానం..

ప్రముఖ ఓటీటీ వేదికగా ఆహాలో హీరో బాల‌కృష్ణ ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ అనే టాక్ షో నిర్వ‌హిస్తున్నారు. ఈ టాక్ షోకు ఇప్పటి వరకు సినీ ప్రముఖులు వచ్చి సందడి చేయ‌డంతో రోజు రోజూకీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు ఓటీటీలోనే ఈ షో సంచలనం సృష్టిస్తోంది.

akhanda movie

తాజాగా ఈ షో కొత్త ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో సోమవారం విడుదలైంది. ఈ ఎపిసోడ్​కు ‘అఖండ’ చిత్రబృందం విచ్చేసి సందడి చేసింది. ఇందులో భాగంగానే హీరో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరైనా సిద్ధంగా ఉంటే తాను విలన్​గా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఆ సినిమాలో హీరోగా కూడా తానే చేస్తానని  బాలకృష్ణ అన్నారు. ఈ ఎపిసోడ్​కు ‘అఖండ’ చిత్రబృందం విచ్చేసి సందడి చేసింది. ఇందులో భాగంగానే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు బాలయ్య.

ఈ షోలో నటుడు శ్రీకాంత్​తో కలిసి బాలయ్య చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీరిద్దరూ కలిసి ‘అఖండ’లోని తమ డైలాగ్​లు చెబుతూ మరోసారి సరదాగా తలపడ్డారు.

బోయపాటిని కూడా సరదాగా ఆట పట్టించారు బాలయ్య. వీరి సంభాషణలు నవ్వులు పూయించాయి. ఈ క్రమంలోనే.. ‘మీరు ప్రపంచానికి ప్రశ్న ఏమో నాకు మాత్రం సమాధానం’ అంటూ దర్శకుడు బోయపాటి శ్రీను.. బాలయ్యతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు.

Thumbnail image

హీరోయిన్​ ప్రగ్యా జైశ్వాల్​, సంగీత దర్శకుడు తమన్​తో కలిసి సరదా ఆటలు ఆడారు బాలయ్య. ఇందులో భాగంగా ఓ గ్లాస్​లోకి తమన్​ బంతిని విసరగా అది కాస్తా ప్రగ్యా పక్కకి పడింది. అప్పుడు.. ‘ఏంటి బంతిని గ్లాస్​లోకి వేశావా అమ్మాయి మీదకి వేశావా? పాట నీదేమో పాప మాత్రం నాది’ అంటూ బాలయ్య చెప్పిన సరదా డైలాగ్​ ప్రేక్షకులను తెగ నవ్వించింది.

అంతేకాకుండా నందమూరి తారకరామరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనుహ్యాంగా ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవడం.. ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. ఎన్టీఆర్ తర్వాత ఆయన అల్లుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.

అయితే చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని.. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ వెన్నంటి ఉండకుండా.. చంద్రబాబుకు మద్దతు తెలిపారని ఇప్పటికీ ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తూ ఉంటాయి. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ స్పందించలేదు.

కానీ తాజాగా విడుదలైన అన్‏స్టాపబుల్ టాక్ షో ప్రోమోలో బాలకృష్ణ ఈ విషయాలపై స్పందిస్తూ ..వెన్నుపోటు పొడిచారు గురించి చెప్తుంటే కన్నీళ్లు వస్తాయి. నేను ఆయన కొడుకులలో ఒకరిని.. ఆయన అభిమానుల్లో ఒకడిని అంటూ భావోద్వేగానికి గురయ్యారు బాలకృష్ణ. ఇక ఈ ఎపిసోడ్ డిసెంబర్ 10న ప్రసారం కానుంది.

Related posts