telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాక్ ‌డౌన్ ఇంకా పొడిగిస్తే మా పరిస్థితి… చేతిలో చిప్పతో బ్రహ్మాజీ

Bramhaji

కరోనా మహమ్మారి కారణంగా సెలెబ్రిటీలతో సహా సామాన్యులంతా దాదాపుగా 50 రోజుల నుంచి ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పటికే లాక్ డౌన్ ను రెండుసార్లు పొడిగించిన కేంద్రం, ఇప్పటికీ కరోనా కట్టడి కాకపోవడంతో లాక్ డౌన్ 4.0పై సమాలోచనలు సాగిస్తున్నారు. ఎంతో మంది మధ్యతరగతి ప్రజలు వేతనాలు లేక, ఇళ్లకే పరిమితమై అవస్థలు పడుతున్నారు. ఇక దిగువ తరగతి ప్రజలు మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుని పోయారు. లాక్ డౌన్ ను పొడిగిస్తే, తమ పరిస్థితి మరింత ఘోరంగా మారిపోతుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొని వుంది. ఈ నేపథ్యంలో పేదలు, మధ్యతరగతి వాళ్లపైనే లాక్ డౌన్ ప్రభావం ఉంటుందని భావించనక్కర్లేదని, లాక్ ‌డౌన్ ఇంకా పొడిగిస్తే తమ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందంటూ, చేతిలో చిప్ప పట్టుకుని కూర్చున్న తన పాత ఫొటోను నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “లాక్ ‌డౌన్ ఇంకా పొడిగిస్తే మా పరిస్థితి ఇది…” అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

Lockdown extend ayithe maa condition …

A post shared by Actor Brahmaji (@brahms25) on

Related posts