telugu navyamedia
సినిమా వార్తలు

కండలవీరుడుకు ఎర్‌పోర్ట్‌లో అవ‌మానం..!

బాలీవుడ్ స్టార్ , కండలవీరుడు హీరో సల్మాన్ ఖాన్ కు ఎర్‌పోర్ట్‌లో అవ‌మానం జ‌రిగింది. షూటింగ్ నిమ్మితం విదేశాలకి వెళ్తున్న స‌ల్మాన్‌ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తన డాక్యుమెంట్స్ చూపెట్టిన తరువాతనే లోపలోకి వెళ్లాలని చెప్పాడు ఆ అధికారి. దాంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Trouble For CISF Officer Who Stopped Salman Khan at Mumbai Airport For Checking

మ‌రో ప‌క్క‌ అంతటి స్టార్ హీరోని చూసి గుర్తుపట్టినా కూడా అందరిముందే ఆపి రూల్స్ ప్రకారం తనిఖీలు చేపట్టి, త‌న డ్యూటీని సంక్ర‌మంగా నిర్వ‌హించిన ఆ అధికారిపై సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కాయి.

అయితే ఎక్కడివరకు బాగానే ఉన్న ఆ తరువాత అసలు చిత్రం మొదలైంది. సల్మాన్ ఖాన్ ని అందరిముందే ఆపి చెక్ చేసిన ఆ సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ అధికారిపై అధికారులు కోపం అయ్యార‌ని, అతని ఫోన్ ని సీజ్ చేసి మందలించారని ఒక వార్త వైరల్ అవ్వటంతో సోషల్ మీడియాలో తీవ్ర వివాదం అయింది.

Salman Khan shoots for Tiger 3 in Russia, clicks selfies with fans who wish him 'good luck sir' | Bollywood - Hindustan Times

నిజాయితి గా డ్యూటీ చేసిన అధికారిని అవమానిస్తారా అంటూ నెటిజన్స్ సీరియస్ అవ్వగా.. లేటెస్ట్ గా ఆ రూమర్స్ ని కొట్టిపడేసింది ఢిల్లీ సెక్యూరిటీ సిబ్బంది. సోషల్‌ మీడియా వేదికగా ఢిల్లీ సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది స్పదిస్తూ.. ఈ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. ఈ విషయంలో తమ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. అంతేగాక తన ఫోన్‌ను సీజ్‌ చేయలేదని, కనీసం మందలించడం కూడా జరగలేదని తెలిపారు.

CISF Officer Who Stopped Salman Khan At Mumbai Airport Gets Rewarded For Exemplary Professionalism

ఆయన ఓ సెలబ్రిటీ అనేది సంబంధం లేకుండా విధుల్లో తన డ్యూటీని సక్రమంగా నిర్వర్తించినందుకు సదరు అధికారిని సత్కరించి, రివార్డు ప్రకటించినట్లు సీఐఎస్‌ఎఫ్‌ తమ ట్వీట్లో పేర్కొంది.

Related posts