telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేశం విడిచి వెళ్ళిపోతానంటున్న మాధవీలత… ఏమైందంటే ?

madhavi-latha comments

మొన్న డిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. దాని గురించి సినీ నటి, బీజేపీ నేత మాధవీలత మాట్లాడుతూ…”నాకు దేశం విడిచి ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలని ఉంది. ప్రతి చోటా మోసం, ఫేక్ ప్రజలు, ఫ్రాడ్ ప్రజలు, ప్లాస్టిక్ నవ్వులు, అవసరాలు, అవమానాలు తప్ప ఇంకేమీ లేవు. అసలు ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఎందుకు ప్రజలు ప్లాస్టిక్‌లా మారిపోయారు? AAP భారీ విజయంతో టిఆర్ఎస్, టిఎంసి, డిఎంకె వంటి పార్టీలన్నీ విఫలమైన ఫ్రంట్ ప్రతిపాదనను మళ్లీ తెరమీదకు తెస్తున్నాయి. కానీ ఈ పార్టీలన్నిటికీ ఉన్న స్వార్థపూరిత అధికార దాహం వల్ల, అవి ఎన్నికల్లో ఒక్కటిగా ఎప్పటికీ కలవలేవు అని బీజేపీ గట్టిగా భావిస్తోంది. ఒకవేళ ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటి కావాలంటే, వాటిని కూడగట్టడానికి ఒక జాతీయ పార్టీ కావాలి. కానీ, కాంగ్రెస్ అంపశయ్య మీద చావుబతుకుల్లో ఉంది. ఆ పార్టీ నాయకులకు గౌరవం లేదు. ప్రాంతీయ పార్టీల కూటమిని నడిపించే శక్తీ లేదు. కుటుంబ రాజకీయ వ్యాపారాలు చేస్తూ పండిపోయిన రాజకీయ పార్టీలతోనూ, ముదురు తెలివితో వ్యవహరించే ప్రాంతీయ పార్టీలతోనే కలసి పనిచేయగలిగే యుక్తీ, శక్తీ, అనుభవం ఉన్న పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కాదు. ప్రస్తుత భారత రాజకీయాల్లో క్రియాశీల ప్రాంతీయ పార్టీల కూటమి లేదా ఫ్రంట్ సాధ్యపడుతుందని బీజేపీ విశ్వసించడం లేదు. కాకపోతే మాపై జాతీయ స్థాయిలో మరొకసారి భారీ ఎత్తున వ్యతిరేక ప్రచారానికి మాత్రం ప్రయత్నిస్తారు. మరో మూడు శాతం ఓట్లు పడి ఉంటే బీజేపీ గెలిచుండేది. డిల్లీలో చాలా మంది ప్రజలు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు. దేశాన్ని నడిపించే నాయకుడిని ఎన్నుకోలేనప్పుడు ఈ ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థంకావడంలేదు’’ అంటూ బాధపడ్డారు మాధవి.

Related posts