telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రెక్కలు తెగి పడిన పక్షిలాగా

“ప్రేమ” పేరుతో తీయగా కబుర్లు చెబుతూ,
వంచిస్తూ, మోసం చేస్తూ,
“ప్రేమ” అనే ముసుగు నీడలో,
మగ పశువులు కామాంధులై,
మాయమాటలు చెప్పి లోబరుచుకుంటూ,
పెద్ద మనుషులు వలె సంచరిస్తూ,
ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్న
మగ పిశాచాలకు అంతనేది లేదా ?
శీలం ఆడదానికేనా ? మగవాడికి లేదా ?
ఏమీ తెలియని అయోమయ పరిస్థితిలో మోసపోయిన ఆడపిల్ల తను ఏం కోల్పోయిందో తెలియక,
సమాజాన్ని ప్రశ్నించ లేక,
కుటుంబ వ్యవస్థ నుండి బయటకొచ్చి పోరాడలేక,
నలుగురిలో అవమానాల పాలు కాలేక,
బిక్కచచ్చి, బయటకు రావాలంటేనే భయపడి,
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక,
తన ఆశలకు హద్దులు పెట్టుకొని,
స్వేచ్ఛగా తన లక్ష్యాన్ని సాధించలేక,
పోరాడుతుంది నిరంతరం – జీవన పోరాటంలో భాగంగా, “రెక్కలు తెగి పడిన పక్షిలాగా “…

Related posts