రాజ్యసభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, ప్రజలు పోరాటం చేసి విశాఖ ఉక్కు సాధించుకున్నారని అన్నారు. ప్రైవేటీకరణ చేస్తే ఇక రాష్ట్రానికి మిగిలేదేమిటి ? అని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటును మూడు దశల్లో పునరుద్ధరించాలని సీఎం జగన్ లేఖ రాశారని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ బకాయిలపై వడ్డీ, రుణమాఫీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రుణాలను ఈక్విటీ గా మార్చాలన్న అయన విశాఖ ఉక్కుకు క్యాప్టివ్ మైన్స్ ను కేటాయించాలని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పై లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదు అని అయన అన్నారు. టీడీపీ హయాంలో దేవాలయాలను కూల్చి వేశారని, సంకుచిత బుద్ధితో దేవాలయాలను టిడిపి నేతలు కూల్చారని అన్నారు. వీటికి సంబంధించి సీసీటీవీలో ఆధారాలు దొరికాయని, దేవాలయాలపై దాడులు ఘటనలు మా పరిపాలనలో చాలా తగ్గాయని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రవీణ్ చక్రవర్తి అనే మత బోధకుడు ( పాస్టర్) మతమార్పిడులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఇక విశాఖ మెట్రో ప్రాజెక్టులకు బడ్జెట్ లో నిధులు కేటాయించక పోవడం దురదృష్టకరమని అన్న ఆయన విశాఖ రైల్వేజోన్ పై ఎలాంటి ప్రస్తావన చేయలేదని అన్నారు.
previous post
next post