telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

షాపింగ్ మాల్ ప్రారంభించిన కవిత

kavitha trs

హైదరాబాద్ అమీర్ పేటలో మాంగళ్య షాపింగ్ మాల్ ను  నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె షోరూమ్ లో తిరుగుతూ పలు రకాల చీరలను పరిశీలించారు.నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తే ప్రజలు ఆదరిస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరంగల్ లో తొలి షోరూమ్ ను ప్రారంభించిన కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 9 షోరూమ్ లను ప్రారంభించడం గొప్ప విషయమని అభినందించారు. మరిన్ని షోరూమ్ లను ప్రారంభించి మరికొందరికి ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts