telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

చల్లటి కబురు : మూడు రోజుల పాటు వ‌ర్షాలు

నిన్న దక్షిణ కేరళలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కేరళా అంతటా మరియు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో కొంత భాగంలోకి ప్రవేశించినవి. రాగల 2 నుండి 3 రోజులలో తెలంగాణా రాష్ట్రంలో దక్షిణ జిల్లాలలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

నిన్నటి దక్షిణ ఛత్తీస్గడ్ & పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి మి వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు తెలంగాణా నుండి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి1.5కి మి వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ఈ రోజు బలహీన పడినవి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు నైరుతి దిశగా తెలంగాణా రాష్ట్రంలోకి వస్తున్నవి.

రాగల 3 రోజులు (04,05,06వ తేదీలు) తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఈ రోజు, రేపు (05,06వ.తేదీలు)కొన్ని ప్రదేశములలో ఎల్లుండి(07వ తేదీ) ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

వాతావరణహెచ్చరికలు:-

రాగల 3 రోజులు (04,05,06వ.తేదీలు) ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షం తెలంగాణాలోని ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి. మరియు ఈ రోజు భారీ వర్షములు తెలంగాణాలో కొన్ని జిల్లాలలో నైరుతి, ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి.

Related posts