telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మ “కరోనా వైరస్” ట్రైలర్

Corona

లాక్ డౌన్ సమయంలో అందరూ సినిమాలకి దూరంగా ఉంటే దర్శకుడు వర్మ మాత్రం వరుస పెట్టి సినిమాలను చేస్తూ ఓటీటీ వేదికగా సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చాడు. నగ్నం, పవర్ స్టార్ సినిమాలను రిలీజ్ చేశాడు వర్మ. ప్రస్తుతం వర్మ ‘కరోనా వైరస్’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. దీనికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసి సినిమా పైన మంచి ఆసక్తిని పెంచాడు వర్మ. రాము లేటెస్ట్ మూవీస్ అయిన ‘కరోనావైరస్’, ‘మర్డర్’ సినిమాల్లో కీలక పాత్ర పోషించిన శ్రీకాంత్ అయ్యంగార్ పుట్టిన రోజు వేళ రాము బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల ట్రైలర్లు రిలీజ్ చేశాడు. “తన తీవ్రమైన నటనతో కరోనా వైరస్ ను ‘మర్డర్’ చేసిన అద్భుతమైన నటుడు.. బహుముఖ ప్రజ్ఞ శ్రీకాంత్ సొంతమన్నాడు వర్మ. ఇక కుటుంబంలోని ఒక వ్యక్తికి కరోనా లక్షణాల నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్లో ఇద్దరు తెలుగు సీఎంల వాయిస్ లను కూడా లాగాడు రాము. ‘పారాసిటిమాల్ వాడితే సరిపోతుంది సర్..’ , ‘బ్లీచింగ్ దానిమీద వేసేస్తే..’ అంటూ సాగిన ఆ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts