ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్‌మాస్ ఎంపికైంది. హాంకాంగ్‌లో ఈ నెల 20వ తేదీ నుంచి జరుగనున్న ఈ పోటీలలో సాదియా భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తుందని సాదియా తండ్రి, కోచ్ సంధాని తెలిపారు. ఈ మేరకు స్థానిక వైష్ణవి కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి అభినందన సభ ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో క్రీడా విభాగం జిల్లా చీఫ్ కోచ్ రాజేంద్రప్రసాద్, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు, అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, పారిశ్రామికవేత్త మోతుకూరి సాంబశివరావు, కొమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం, విశ్రాంత డీఎస్పీ ఎం.మధుసూదనరావు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని సాదియాను అభినందించారు.