telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

నటుడు ప్రకాష్ రాజ్ .. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ..

prakash raj nomination as independent

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ బెంగళూరు సెంట్రల్‌ పార్లమెంటు స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రకాశ్‌ రాజ్‌ స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. గతంలోనే ప్రకాశ్‌రాజ్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్ధిగి పోటీ చేస్తానని ప్రకటించారు.

మార్చి 12వ తేదీన బెంగుళూరులో మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజకీయ ప్రసంగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రసంగాన్ని ఒకరు రికార్డు చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌పై కబ్బన్‌ పార్కు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Related posts