బుల్లితెర భారీ పాపులారిటీ షో బిగ్ బాస్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్, వీడియో ప్రోమో రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేరకు అతిత్వరలో షో ప్రారంభం కానున్నట్లు హింట్ ఇచ్చేశారు. అయితే హోస్ట్, కంటిస్టెంట్ వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. కానీ ఇన్‌సైడ్ టాక్ మేరకు బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌గా మరోసారి నాగార్జుననే కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సీజన్ 100 రోజులు కాకుండా 50 నుంచి 70 రోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నిజానికి కరోనా మహమ్మారి లేకుంటే ఈ పాటికే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై ఉండేది. కానీ కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం, పరిస్థితులు తారుమారు కావడంతో కాస్త ఆలస్యమైంది.
Here is the most awaited time of the year!!! #BiggBossTelugu4 coming soon on @StarMaa#StaySafeStayStrong #MaaPrayatnamManakosam pic.twitter.com/cQZ1e1kclI
— starmaa (@StarMaa) July 20, 2020