మొన్నటివరకు వరసగా ఆఫర్లు అందుకుంటూ వచ్చిన అందాల భామ మెహరీన్ కౌర్ ఫిర్జాదా ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాని సరసన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ఇక్కడ ప్రేక్షకులకు పరిచయం అయిన ఆమె.ఆ తర్వాత మహానుభావుడు, రాజా దిగ్రేట్, జవాన్ తోపాటు పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ఎఫ్ 2 సినిమా హిట్ అయినా మెహరీన్ కు అంతగా పేరు రాలేదు .అయితే.. ఈ భామ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నట్లు తెగ ప్రచారం జరుగుతుంది. హర్యానా మాజీ సీఎం దివంగత భజన్‌లాల్ బిష్ణోయ్… మనవడు భవ్య బిష్ణోయ్‌ను ఆమె పెళ్లాడనుంది.. వీరిద్దరు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తల పై స్పందించిన మెహరీన్ అవ్వని నిజమేనని తేల్చింది. అయితే రాజస్థాన్‌లోని జైపుర్ అలీలా కోటలో మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. పెళ్లి తర్వాత మెహ్రీన్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చుడాలిమరి వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనేది.
previous post
next post