telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ చిన్న దర్శకుడితో బాలీవుడ్ బడా హీరో పాన్ ఇండియా మూవీ…!

Vivek-Oberoi

బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ వివేక్ ఒబెరాయ్ తాజాగా టాలీవుడ్ చిన్న దర్శకుడితో వివేక్ ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. తనీష్ హీరోగా రూపొందిన ‘రంగు’ సినిమాకు కార్తికేయ దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ డైరెక్టర్ వివేక్ ఒబెరాయ్ కు స్టోరీని వినిపించాడట. స్టోరీ నచ్చడంతో వివేక్ ఒకే చెప్పాడట. 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నాడట కార్తీకేయ. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సరిహద్దు’ అనే టైటిల్ ను అనుకుంటున్నారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. కాగా వివేక్ “రక్తచరిత్ర” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కన్పించి ఆకట్టుకున్నాడు. మరోవైపు తమిళ్ సినిమాల్లోనూ విలన్ గా నటిస్తున్నాడు వివేక్ ఒబెరాయ్. ఇలా వివేక్ బాలీవుడ్ స్టార్ అయినప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

Related posts