telugu navyamedia
సినిమా వార్తలు

బన్నీ స్టైలిష్‌ క్యారవాన్ “ఫాల్క‌న్‌” ఎలా ఉందంటే…

Falcon

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమా సెట్స్ లో ఉన్న బ‌న్నీ కార‌వాన్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఆరు కోట్ల రూపాయ‌లు పెట్టి బ‌న్నీ ఈ వ్యాన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించాడ‌ట‌. తాజాగా ఆ వ్యాన్ గురించి బ‌న్నీ ట్వీట్ చేశాడు. “నా జీవితంలో నేను పెద్ద స్థాయిలో ఏది కొనుకున్నా నాకు ఒక‌టే గుర్తుకు వ‌స్తుంది.. అభిమానులు నామీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. వారి ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఇవన్నీ కొనగలుగుతున్నాను. నా మీద ప్రేమ చూపిస్తున్న అందరికీ రుణపడి ఉంటాను. ఇదే నా వ్యానిటీ వ్యాన్‌.. `ఫాల్క‌న్‌” అని ట్వీట్ చేశాడు. ఇంటీరియ‌ర్ ఫోటోల‌ను కూడా పోస్ట్ చేశాడు. ఈ క్యారవాన్ చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ క్యారవాన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related posts