telugu navyamedia
సినిమా వార్తలు

‘కాలం రాసిన కథలు’ నుంచి ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ ..

అభిలాష్ గోగుబోయిన ,అనీల్‌ హీరో లుగా ఎమ్‌ఎన్‌వి సాగర్ స్వీయ దర్శకత్వంలో ఎస్‌ఎమ్ ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం‘కాలం రాసిన కథలు’ .

ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్‌ను తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాట‌ను  ఎమ్‌ఎన్‌వి సాగర్‌గారు రాసిన లిరిక్స్ అందించగా.. సాయి చరణ్ ఆలపించారు.

కాలం రాసిన కథలు టైటిల్ చాలా బాగుంద‌ని, అలాగే సాగర్ రాసిన డబ్బు విలువ తెలియజేసే సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి సాగర్‌కి మరియు చిత్రంలో నటించిన నటీనటులు అలాగే పనిచేసిన టెక్నీషియన్లకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శ్రీకాంత్ తెలిపారు.

‘‘నంధ్యాల నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాల కోసం తిరుగున్న టైమ్‌లో నాకు ‘కాలం రాసిన కథలు’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన సాగర్‌గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ‘నమ్మకానికి, మోసానికి మధ్య నలిగిపోతున్న మనిషి కథలు’ అంటూ తెరకెక్కుతున్న ఈ సినిమా ఔట్‌ఫుట్ చాలా బాగా వస్తుంది.

ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన హీరో శ్రీకాంత్‌గారికి ధన్యవాదాలు అని,‘‘టాలెంట్ ఉన్న కొత్త నటీనటులను ప్రోత్సహిస్తూ.. నా సినీ కెరియర్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఈ చిత్రంలో మంచి అవకాశం ఇచ్చిన సాగర్‌గారికి థాంక్యూ హీరో తెలిపారు.

 

Related posts