telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జార్జిరెడ్డి” నుంచి తొలగించింది ఈ పాటనే… సాంగ్ వైరల్

George-Reddy

జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్‌ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘జార్జిరెడ్డి’. యూత్‌తో పాటు ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం ఆకట్టుకుంది. పీడీఎస్‌యూ నాయకుడు జార్జిరెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘జార్జిరెడ్డి’ పాత్రకు సందీప్ మాధవ్ ప్రాణం పోశాడు. సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించింది. ఈ చిత్రంలో ఒక పాటను తొలగించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ సాహిత్యంతో రూపొందిన ఈ పాట అందరినీ ఆకట్టుకోవడం ఖాయం. ‘మసక మసక మబ్బులెంత జాజి మొగులాలి’ అంటూ సాగే ఈ పాట అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts