telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య ఎఫెక్ట్… ఇకపై అక్కడ సల్మాన్ ఖాన్, ఆలియా భట్ సినిమాలు బ్యాన్ ?

Bollywood

బాలీవుడ్ స్టార్స్ పై బీహార్ వాసులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య కారణంగా బాలీవుడ్‌లోని నెపోటిజమ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ వారసులు, వారిని మాత్రమే ఎంకరేజ్ చేసే కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ వంటి వారు ప్రధాన టార్గెట్లుగా మారారు. వీరికి గట్టిగా బుద్ధి చెప్పాలని బీహార్ వాసులు పట్టుదలగా ఉన్నారట. ఇకపై వీరి సినిమాలను తమ రాష్ట్రంలో విడుదల కానివ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. వెనకబడిన రాష్ట్రమైన బీహార్‌కు చెందినవాడు కావడంతోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను బాలీవుడ్ ప్రముఖులు చిన్నచూపు చూశారని బీహార్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై సల్మాన్ ఖాన్, ఆలియా భట్, కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ తదితరుల సినిమాలను తమ రాష్ట్రంలో విడుదల కానివ్వమని ట్వీట్లు చేస్తున్నారు.

Related posts