telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను బిజీ అంటున్న అజయ్ దేవగణ్ .. అందుకే ఆ రెండిటిలో కుదరలేదు.. 

ajay devagan as guest role in rrr movie
ఇటీవల టాలీవుడ్ లో బాలీవుడ్ నటులు కూడా కనపడుతున్నారు. ఇది సాధారణం అయినప్పటికీ, స్టార్ నటులు కూడా తెలుగు చిత్రాలలో నటిస్తుండటం విశేషం. దీనికి ఉదాహరణగా, 2.ఓ చిత్రంలో అక్షయ్ ప్రతినాయకుడిగా ప్రేక్షకులను చక్కగా అలరించాడు. తాజాగా మరో హిందీ నటుడు అజయ్ దేవగణ్ కూడా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో అలాగే ఇండియన్-2 లో కూడా ప్రధానపాత్రలలో కనిపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఆయన వరకు వెళ్లడం, దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. 
భారతీయుడు 2 సినిమాలో తాను నటిస్తున్నానని వస్తున్న వార్తలు నిజం కాదని..కాకపోతే శంకర్ గతంలో తనను ఈ సినిమాలో నటించమని కోరారు..కానీ ప్రస్తుతం తాను ‘తానాజీ’సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరకపోవడంతో ఆ సినిమాలో నటించలేనని చెప్పానని అన్నారు. ఇక రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదు. రాజమౌళి ఇంత వరకు నన్ను సంప్రదించలేదని అన్నారు. తానాజీ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో తీస్తున్న కారణంతో ఏ సినిమాలకు ప్రస్తుతం డేట్స్ ఇవ్వడం కుదరడం లేదని అజయ్ దేవగణ్ అన్నారు. త్వరలో తానాజీ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌తో మీ ముందుకు వస్తాను అని బదులిచ్చాడు. 

Related posts