telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు… టిక్ టాక్ స్టార్ సోనాలి వెనుకంజ

Sonali

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆధిక్యం హోరాహోరీగా ఉంది. అధికార బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ టికెట్ పొంది అదంపూర్ స్థానం నుంచి పోటీ చేసిన టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫొగట్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కుల్దీప్ బిష్నోయ్ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన కుల్డీప్‌కు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉండడం విశేషం. ఇక ఐఎన్ఎల్డీ అభ్యర్థి రాజేష్ గొదార, బీఎస్పీ అభ్యర్థి సత్బిర్ చింపా కాంగ్రెస్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 28 స్థానాల్లో హవా కొనసాగిస్తోంది. ఇక జేజేపీ 9 స్థానాలు, ఐఎన్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Related posts