telugu navyamedia
సినిమా వార్తలు

న్యాచురల్ స్టార్ నాని ఆవిష్కరించిన ‘మసూద’ టీజర్

‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ హీరోగా న‌టిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా న‌టిస్తున్న సినిమా ‘మ‌సూద‌’ . ఈ సినిమాలో సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

‘మ‌ళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ఇది.

ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్, పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్‌ని అందుకొంది.. తాజాగామంగళవారం న్యాచురల్ స్టార్ నాని ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించారు.

టీజర్ ప్రామిసింగ్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రంలో చేసినట్లుగా అనిపిస్తుందని, టీజర్ చూస్తుంటే.. ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా.. అని అనిపిస్తుందని తెలుపుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హర్రర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో నూతన డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.


టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన న్యాచురల్ స్టార్ నాని గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఆయనకు టీజర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంస్థలో వస్తున్న ఈ మూడో చిత్రం కూడా ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ చిత్రంతో సాయికిరణ్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాము.

సాయికిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి తీరు.. ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, అలాగే పనిచేసిన సాంకేతిక నిపుణులకు, సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే చిత్ర ట్రైలర్‌, అలాగే మూవీ విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

Related posts