సంక్రాంతి అనగానే సినిమాల సందడి ప్రారంభం అయినట్టే. ఈ సారి కూడా పండగకు చాలా సినిమాలు విడుదల అయినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం ఎఫ్ 2( ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్‌లో వెంకీకి తోడల్లుడిగా అదరగొట్టాడు. ఇక వెంకటేశ్ అయితే నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి తర్వాత తనలోని కామెడీ యాంగిల్‌ని ప్రేక్షకులకి మరోసారి చూపించాడు. అంతేగా అంతేగా అంటూ.. హీరోలిద్దరూ చేసే మేనరిజం మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. చిత్రం చూసిన పెళ్ళైన మగాళ్ళు, ఆడవాళ్ళు స్టోరీలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయి పగలబడి నవ్వుకున్నారు. రాజేంద్రప్రసాద్ కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. మనదగ్గరే కాదు యూఎస్‌లోను ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది.
తాజాగా ఈ చిత్రంలోని ఒక ఫుల్ వీడియో సాంగ్స్ విడుదల చేసి అభిమానులని అలరిస్తున్నారు యూనిట్. తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ అంటూ సాగే వీడియో సాంగ్ విడుదల చేశారు. పెళ్ళాలని వదిలి ఫారెన్‌కి వచ్చిన వెంకీ, వరుణ్ , రాజేంద్ర ప్రసాద్‌లు ఎంతగా ఎంజాయ్ చేస్తారో సాంగ్‌లో చూపించారు. ఎఫ్ 2 చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లోనే అత్యధిక లాభాలను తీసుకువచ్చిన చిత్రం కావడం విశేషం. తమన్నా ,మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 చిత్రానికి వచ్చే ఏడాది సీక్వెల్ కూడా రానుందని అంటున్నారు.