telugu navyamedia
సినిమా వార్తలు

గుజరాతీలో “బాహుబలి” రీమేక్… రిస్క్ చెయ్యాల్సిందేనంటున్న దర్శకనిర్మాతలు

Bahubali

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా దగ్గుబాటి, అనుష్క ప్రధాన పాత్రల్లో రూపొందిన “బాహుబలి” సిరీస్ దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. బాహుబలి, బాహుబలి-2 కూడా సరికొత్త బాక్సాఫీసు రికార్డులు సృష్టించాయి. దేశంలోనే అత్యధికంగా వసూళ్లు రాబట్టిన సినిమాలుగా నిలిచాయి. చైనాలో విడుదల చేస్తే అక్కడ కూడా వసూళ్ళ వర్షం కురిపించాయి. దీంతో దేశంలోని ఇతర భాషల్లో కూడా “‘బాహుబలి”ని రిమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా రాజకీయంగా “బాహుబలి” చిత్రం గురించి చాలాసార్లు ప్రస్తావించారు. ఇప్పుడు మోదీ స్వరాష్ట్రంలో “బాహుబలి”ని రీమేక్ చేసేందుకు ప్రముఖ యూట్యూబర్లు నితిన్ జానీ, తరుణ్ జానీ “బాహుబలి” సిరీస్‌ను గుజరాతీలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ‘”మా రాష్ట్ర ప్రజల కోసం ఈ పెద్ద ప్రాజెక్టును రిమేక్ చేస్తున్నాం. జీవితంలో రిస్క్ చేయకపోతే ఫన్ ఉండదు. గుజరాతీ పేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం” అని అన్నారు. మరి ఈ రీమేక్ అక్కడి ప్రజలను ఎంతమేరకు ఆకట్టుకుందో చూడాల్సిందే.

Related posts