telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నీ కారు ఎంత? నీ స్థాయి ఎంత? అన్నావ్ కదా… దేవుడు ఉన్నాడ్రా అభిరామ్… : శ్రీరెడ్డి

Srireddy

దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ కారు ఈరోజు యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. శ్రీరెడ్డి షేర్ చేసిన వీడియోలో తనదైన శైలిలో బూతులతో విరుచుకుపడలేదు కాని.. అభి గతంలో తనను అన్న మాటల్ని గుర్తుచేసింది. ‘అభి (దగ్గుబాటి అభిరామ్) నీకు గుర్తుందా.. నీ కారు ఎంత? నీ స్థాయి ఎంత? నేను రానా తమ్ముడ్ని.. సురేష్ బాబు కొడుకుని.. రామానాయుడు మనువడ్ని.. నీదో డొక్కు కారు.. నువ్వు ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ యాక్టర్స్‌వి.. అని అన్నావే.. నన్నూ, నా కార్‌ని అవమానించావే.. ఈరోజు నీ కారుకి ఏదో యాక్సిడెంట్ అయినట్టు ఉంది. దేవుడు ఉన్నాడ్రా.. దేవుడు ఉన్నాడు.. ఎప్పుడూ మిడిసిపడకు. డబ్బు, పేరు, అందం శాశ్వతం కాదురా.. మంచి పేరు, మంచితనమే శాశ్వతంగా ఉంటాయి. ఎదుటి వాళ్లని అర్థం చేసుకోవడం.. వాళ్లకి అపకారం చేయకుండా ఉండటం.. మంచిగా బతకడం. నేనైతే ఉత్తమురాలిని కాకపోవచ్చు కాని.. నేను నీకు చెప్పినవాటిని ఫాలో అవుతున్నాను.. నేర్చుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్ అవుతూ తన ఫేస్ బుక్ ద్వారా వీడియో విడుదల చేసింది శ్రీరెడ్డి.

Related posts