telugu navyamedia
సినిమా వార్తలు

ఫ్యాన్స్‌కు ప‌వ‌ర్‌స్టార్‌ మరో సర్‌ప్రైజ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా అభిమానులకు స్పెషల్ మ‌రో సర్‌ప్రైజ్ వ‌చ్చేసింది. ఈ ఏడాది పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్, జనసేన పార్టీ సభ్యులు, కార్యకర్తలు.. సెప్టెంబర్ 2న వరుసగా పవన్ నటిస్తున్న నాలుగు కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌తో.. సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.

ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ బీభత్సంగా వైరల్ అవుతోంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హిస్టారికల్ ఫిలిం ‘హరి హర వీర మల్లు’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఇంతలోనే ముచ్చటగా మూడో అప్‌‌డేట్ రానే వచ్చింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న నూతన చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

రీసెంట్‌గా మెగాస్టార్‌ నటించిన సైరా సినిమాతో మెగా అభిమానులను ఆకట్టుకున్న సురేందర్ రెడ్డి. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు. తాజాగా పవన్ బర్త్ డే కానుకగా ఈ సినిమానుంచి ఓ అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ కాంబినేషన్ మూవీ నుంచి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘యథా కాలమ్.. తథా వ్యవహారమ్” అంటూ సంస్కృతంలోని లైన్స్‌తో పవన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ను డిజైన్ చేశారు.

హైదరాబాద్ నగరాన్ని బ్యాక్ గ్రౌండ్‌లో చూపిస్తూనే పైన ఓ గన్‌ను చూపించారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందని ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక సురేందర్ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.9 గా ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. రామ్ తాళ్లూరి ఈ మూవీని నిర్మించనున్నారు.

1

కాగా..దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్.. వకీల్ సాబ్‌గా బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ లాయర్‌గా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

హరి హర వీరమల్లు అనే ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా నటించనున్నాడని అంటున్నారు. ఈ సినిమా మొగలాయిలా నాటి కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతోపాటు భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడు పవన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో దగ్గుబాటి యంగ్ హీరో రానా కూడా నటిస్తున్నాడు

Hari Hara Veera Mallu Movie Release Date Out - Sakshi
కాగా.. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. 2022 వేసవి కానుకగా ఏప్రిల్‌ 29న హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Related posts