telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైటెక్ సిటీ మెట్రో పరుగులు… !!

hightech city metro by this month last week

ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అమీర్‌పేట్‌ నుంచి హైటెక్‌ సిటీకి మెట్రో రైళ్లు, మార్చి నెలలో పరుగులు పెట్టనున్నాయి. అమీర్ పేట నుంచి కొండాపూర్ కు నిర్మించిన 10 కిలోమీటర్ల ఎక్స్ టెన్షన్ ను మార్చి మూడో వారంలో జాతికి అంకితం చేసే అవకాశాలు ఉన్నాయని మెట్రో అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఈ మార్గంలో భద్రతా పరీక్షలు జరుగుతున్నాయి. 18 రకాల పరీక్షలు కీలక దశకు చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. లోడ్, స్పీడ్, ట్రాక్, ట్రాక్షన్, సిగ్నలింగ్‌ తదితరాలపై రైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎల్బీనగర్, నాగోల్ వరకూ రెండు రూట్లలో రైళ్లు తిరుగుతూ ఉండగా, నిత్యమూ దాదాపు 2 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు.

Related posts