telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

భారీ లాభాలతో … నాట్కో ఫార్మా …

natco pharma with huge gains in

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా రూ.143 కోట్ల లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.181 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే క్రితం క్యూ1 లాభాల్లో 21 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ క్రితం క్యూ1లో 10.65 శాతం తగ్గుదలతో రూ.513 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. 2018-19 ఇదే క్యూ1లో రూ.574 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది.

క్రితం త్రైమాసికంలో లాభదాయకత తగ్గినప్పటికీ.. ప్రస్తుత ఏడాదిలో మెరుగైన రెవెన్యూ నమోదు చేయనున్నట్లు నాట్కో ఫార్మా విశ్వాసం వ్యక్తం చేసింది. 2019-20కి గాను ఈ కంపెనీ బోర్డు రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటి షేర్‌పై రూ.1.25 మధ్యంతర డివిడెండ్‌ను అందించడానికి ప్రతిపాదించింది. దీనికి వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉంటుంది. శుక్రవారం సెషన్‌లో బిఎస్‌ఇలో నాట్కో ఫార్మా షేర్‌ 0.14 శాతం తగ్గి రూ.551.85 వద్ద ముగిసింది.

Related posts