telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

భారతీయులు కరోనా వైరస్ గురించి .. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..

karona virus case in canada found

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై భారతీయుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ తో చైనాలో 100మందికిపైగా చనిపోయారు. ఇప్పటివరకు దీనికి మెడిసిన్ లేదు. వైరస్ సోకితే ప్రాణం పోవాల్సిందే. అందుకే అందరూ వర్రీ అవుతున్నారు. ఇక భారత్ లోనూ కరోనా వైరస్గురించి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ భారత్ లో లేదని చెప్పారు. భారతీయులు భయపడాల్సిన పని లేదన్నారు. కరోనా వైరస్ పై అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి వివరించారు. ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలని అన్ని ఆసుపత్రులు ఆదేశించామన్నారు. కరోనా వైరస్లక్షణాలు కనిపిస్తే హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేయొచ్చు అని చెప్పారు.

ఈ వైరస్ పై ఇప్పటికే కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. మరో 13 విమానాల్లో కరోనా వైరస్ స్కానింగ్ ఏర్పాటు చేశారు. మరిన్ని థర్మల్ స్కానర్లను కొనుగోలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పుణె సహా దేశంలో మరో 4 చోట్ల ల్యాబ్ ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నిన్నటి వరకు (జనవరి 27,2020) 155 విమానాలు, 33వేల 552 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశారు. చైనాలోని భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. స్వదేశానికి వచ్చిన తర్వాత 14 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచనున్నారు. కరోనా వైరస్ చర్యలపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్షరెన్స్ ద్వారా కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు.

Related posts