telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మరో అవినీతి చేప .. ఏసీబీ వలలో చిక్కే..

acb notices to ministers on corruption

ఏసీబీ అధికారుల వలలో రంగారెడ్డి జిల్లాలో మరో అవినీతి చేప పడింది. ఏసీబీ డీఎస్‌పీ సూర్య నారాయణ తెలిపిన వివరాల ప్రకారం… గండిమైసమ్మ సాయినగర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో ఏడాదికోసారి ఆడిటింగ్‌ చేసి కోఆపరేటìవ్‌ అధికారులు రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు గాను సాయినగర్‌ సొసైటీ చైర్మన్‌ భూమిరెడ్డి దగ్గర మేడ్చల్‌ జిల్లా కోఆపరేటివ్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రకిరణ్‌ లంచం డిమాండ్‌ చేయగా.. అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

లంచం అడిగిన సదరు కో ఆపరేటివ్‌ ఇన్‌స్పెక్టర్‌ను పట్టుకొనేందుకు ఏసీబీ అధికారులు వల పన్నారు. వారి సూచన మేరకు హెచ్‌ఏఎల్‌లోని సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ కార్యాలయానికి డబ్బు తీసుకొనేందుకు రావాలని కో ఆపరేటివ్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రకిరణ్‌ను భూమిరెడ్డి పిలిచాడు. చంద్రకిరణ్‌ వచ్చి రూ. 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. దాడుల్లో ఆరుగురు సీఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts