ఆర్టీఐ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించినా, రాజ్యసభ ఆమోదాన్ని పొందడంలో విఫలమై పెండింగ్‌లో ఉండిపోయిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేత సీఎం రమేశ్‌ను కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్ ప్రత్యేకంగా అభినందించారు.
ఆర్టీఐ సవరణ బిల్లుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టడంలో రమేశ్ సఫలమయ్యారు. రమేశ్ కారణంగానే బిల్లుకు సభలో ఆమోదం లభించిందని భావించిన మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు ఆయనను అభినందించారు.