telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ భేటి

Theatres-association

కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 5.ఓ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఈ గైడ్ లైన్స్ లో సినిమా హాల్స్ కు మల్టీ ప్లెక్స్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. లాక్ డౌన్ కారణంగా దాదాపు 7 నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇక కేంద్రం ఇచ్చిన అనుమతితో అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్, మల్టీ ప్లెక్స్ లు రీఓపెన్ కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. కొన్ని సినిమాలు ఓటీటీని నమ్ముకొని విడుదల అయ్యాయి. ఇక ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాతలంతా తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసారు. అందులో భాగంగా తెలంగాణాలో థియేటర్స్ తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు తగ్గట్టుగా తాము ఖచ్చితంగా పలు జాగ్రత్తలు వహిస్తామని తెలిపి కొన్ని కీలక పాయింట్లను తెలిపారు. వాటి ప్రకారం థియేటర్స్ రన్ చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని వాటిని ఈ విధంగా పేర్కొన్నారు. “ఒక సీటు తప్పించి మరో సీటులో కూర్చోపెడతాము”, “ఎంట్రెన్స్ ఎగ్జిట్ లో శానిటైజర్స్ పెడతాం”, “ప్రేక్షకులు మాస్క్ తప్పనిసరి ధరించాలి” అని తెలిపారు. థియేటర్ ఇండస్ట్రీ ఇప్పటికే చావు బ్రతుకులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రతీ థియేటర్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇంసెంటివ్స్ ఇవ్వాలని, లాక్ డౌన్ సమయంలో థియేటర్ ల విద్యుత్ బిల్ మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో పార్కింగ్ చార్జెస్ ను నిషేధించింది. ఆ చార్జెస్ ను తక్షణమే ఎత్తివేయాలని మరో విజ్ఞప్తి చేస్తూ ఈరోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రాడ్స్ లోని సుదర్శన్ 35MM లో తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ భేటిలో చర్చించారు.

Related posts